వైసీపీ ప్లీనరీపై MP Raghurama వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-09T22:08:25+05:30 IST

ఢిల్లీ: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్‌ను విమర్శించారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కాలేదని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్లీనరీపై MP Raghurama వ్యాఖ్యలు

ఢిల్లీ: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్‌ను విమర్శించారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కాలేదని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. 

ప్లీనరీకి 25 వేల మించి జనాలు రాలేదు

‘‘నేను పార్టీ సభ్యుడిగా ప్లీనరీకి వెళ్లాలనుకున్నా. కాని ఆహ్వానం లేదు. విజయమ్మకు కొడుకు, కూతురు మినహా ప్రజల కష్టాలు అవసరం లేదు. ప్లీనరీ సక్సెస్ కాలేదు...25 వేల మించి జనాలు రాలేదు. పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటే బాధేస్తుంది. కొడాలినాని మాటలను ఏకీభవిస్తున్నా. అమరావతిలో మానసిక వైద్యశాల అవసరం అన్నారంటే ఆలోచించాలి. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కలెక్టర్‌ను పిలిచి భయపెట్టారు. అధికారుల బాధలు డీఓపీటీ కార్యదర్శికి వివరస్తా.’’ నని చెప్పారు.

స్టీఫెన్ రవీంద్ర‌పై ఫిర్యాదు చేశా 

‘‘స్టీఫెన్ రవీంద్ర‌పై ఢిల్లీ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశాను. భీమవరానికి వెళ్లే సమయంలో తనను అడ్డుకునేందుకు యత్నించారని పోలీసులు, స్టీఫెన్ రవీంద్ర‌పై కమిషనర్‌కు కంప్లైంటు చేశా’’  అని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-09T22:08:25+05:30 IST