సీఎం జగన్ ఆ మాట చెప్పడం బాధాకరం.. : రఘురామ

ABN , First Publish Date - 2022-01-07T19:13:28+05:30 IST

త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ రఘురామకృష్ణరాజు...

సీఎం జగన్ ఆ మాట చెప్పడం బాధాకరం.. : రఘురామ

న్యూఢిల్లీ/అమరావతి : త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ రఘురామకృష్ణరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రెస్‌మీట్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. సీఎం జగన్ రాయలసీమకు అన్యాయం చేశారు‌. ఏసీబీ దాడులతో భయపెడితే జగన్‌కు పరాభవం, పరాజయం తప్పదు. సొంత పార్టీని బలేపేతం చేసుకోవటానికే వాలంటీర్, సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చారు. నెలలో మాడు, నాలుగు రోజులు మాత్రమే వాలంటీర్లకు పని ఉంటోంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలు తీర్చలేకపోతున్నానని సీఎం జగన్ చెప్పటం బాధాకరం. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పేంటో జగన్ చెప్పాలి..?. సచివాలయాలు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరు పద్ధతిగా లేదు. గోదావరి జిల్లాలో గిరీష్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రాయలసీమలో స్టీల్ ఫ్లాంట్ , కుందు ప్రాజెక్టు కట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందిఅని రఘురామ విమర్శల వర్షం కురిపించారు.

Updated Date - 2022-01-07T19:13:28+05:30 IST