ఆగస్టు 25 వరకు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-07-30T18:47:29+05:30 IST

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది.

ఆగస్టు 25 వరకు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. అదేరోజు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎంపీ రఘురామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కోర్టులో నేడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జరిగిందన్నారు. నెల క్రితం ఉన్న పరిస్థితినే సీబీఐ అంగీరకరించినందుకు సీబీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆగస్ట్ 25 వరకు న్యాయం కోరుకునే వారు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే అని అన్నారు. తమ వాదనలన్నీ స్పష్టంగా వినిపించామని, రాతపుర్వకంగా కూడా ఇచ్చినట్లు చెప్పారు. అందరం ఆశావాదంగా ఉందామని, నిరాశ చెందవలసిన అవసరం లేదని అన్నారు. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. విదేశాలకు పారిపోయేందుకు A2 చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండో రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని  పిటిషన్ వేయనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. 

Updated Date - 2021-07-30T18:47:29+05:30 IST