Mp కుమారుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-06-24T17:47:44+05:30 IST

ఆమ్నీ బస్సును అపహరించిన వ్యవహారంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు సూర్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఓబీసీ

Mp కుమారుడి అరెస్టు

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 23: ఆమ్నీ బస్సును అపహరించిన వ్యవహారంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు సూర్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఓబీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 11న చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిలో సూర్య వెళుతున్న కారును ఆమ్నీ బస్సు ఢీకొంది. దీంతో డ్రైవర్‌ను బెదిరించి బస్సును సూర్య తీసుకెళ్లినట్లు తిరుచ్చి కంటోన్మెంట్‌ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు గురువారం సాయంత్రం సూర్యను అరెస్ట్‌ చేశారు. దానిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీస్‏స్టేషన్‌ ముట్టడించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.


Updated Date - 2022-06-24T17:47:44+05:30 IST