Congress: అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ: ఎంపీ ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-07-22T22:11:55+05:30 IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Congress: అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ: ఎంపీ ఉత్తమ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌(Congress) అధికారంలోకి వస్తే కాళేశ్వరం(Kaleswaram)  అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( uttam kumar reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాళేశ్వరంఅవినీతిలో దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు.  తుమ్మడి హట్టి దగ్గర డ్యాం నిర్మిస్తాం, గ్రావిటీతో నీళ్లు పారేలా చేస్తామన్నారు.కాళేశ్వరం ఇరిగేషన్‌ కాదు, టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు (PothireddyPadu) పూర్తయితే సాగర్ ఎండిపోతుందన్నారు.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నష్టం జరుగుతుందన్నారు.ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిలిపేలా సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువస్తామని తెలిపారు.టీఆర్ఎస్, బీజేపీవి రాజకీయ డ్రామాలని  ఎద్దేవా చేశారు.తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపునని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  జోస్యం చెప్పారు.

Updated Date - 2022-07-22T22:11:55+05:30 IST