పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం.. రఘురామ అనర్హతపై విజయసాయి

ABN , First Publish Date - 2021-07-09T20:57:29+05:30 IST

రఘురామపై అనర్హత పిటిషన్‌ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ..

పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం.. రఘురామ అనర్హతపై విజయసాయి

ఢిల్లీ: రఘురామపై అనర్హత పిటిషన్‌ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్పీకర్‌ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు.


అంతకుముందు, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్‌లకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని విజయసాయిరెడ్డి కోరారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న.. చట్ట వ్యతిరేక విధానాలను షెకావత్‌కు విజయసాయిరెడ్డి వివరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ నిర్మాణానికి అనుమతించాలన్నారు. పాలమూరు, దిండి, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమకాలువ విస్తరణ.. ఏ విధంగా చట్ట విరుద్ధమో షెకావత్‌కు విజయసాయిరెడ్డి వివరించారు.

Updated Date - 2021-07-09T20:57:29+05:30 IST