Mr PM దయచేసి అంతర్జాతీయ విమానాలను ఆపండి

Published: Tue, 30 Nov 2021 10:11:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mr PM దయచేసి అంతర్జాతీయ విమానాలను ఆపండి

ఒమైక్రాన్‌పై  అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్

న్యూఢిల్లీ:మిస్టర్ పీఎం నరేంద్ర మోదీ గారు, దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హిందీలో చేసిన ట్వీట్‌లో 53 ఏళ్ల కేజ్రీవాల్ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘‘అనేక దేశాలు ఓమైక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయి. 

మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? కరోనా వైరస్ మొదటి వేవ్‌లో కూడా మనం విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆలస్యం చేశాం. చాలా అంతర్జాతీయ విమానాలు ఢిల్లీలో దిగడం వల్ల ఢిల్లీ నగరం ఎక్కువగా ప్రభావితమవుతోంది.పీఎం సాబ్ దయచేసి విమానాలను ఆపండి’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో పేర్కొన్నారు.ఒమైక్రాన్ కరోనా కొత్త వేరియెంట్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ ఆదేశించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.