Ophthalmic Engineeringలో ఎంటెక్‌

ABN , First Publish Date - 2022-06-20T21:30:31+05:30 IST

ఐఐటి హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ ప్రోగ్రామ్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఆప్తాల్మిక్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సుకు రూపకల్పన చేసింది. ఈ ఆగస్టు నుంచే ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారు. ఐకేర్‌ అలాగే సంబంధిత టెక్నాలజీ ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్ళను...

Ophthalmic Engineeringలో ఎంటెక్‌

ఐఐటి హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ ప్రోగ్రామ్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఆప్తాల్మిక్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సుకు రూపకల్పన చేసింది. ఈ ఆగస్టు నుంచే ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారు. ఐకేర్‌ అలాగే సంబంధిత టెక్నాలజీ ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు అవసరమైన క్వాలిఫైడ్‌ ఆప్తాల్మిక్‌ ఇంజనీర్లను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సును ఉద్దేశించారు. ఆటు ఆప్తాల్మిక్‌ కేర్‌ ఇటు ఇంజనీరింగ్‌ అంటే ఆప్టిక్స్‌ బయోమెకానిక్స్‌, కంట్రోల్‌ ఇంజనీరింగ్‌ అంశాలను కలగలిపి ఈ కోర్సును మలిచారు. మొత్తమ్మీద ఇంజనీరింగ్‌, ఆప్తాల్మాలజీ, ఆప్టోమెట్రీ కలగలిసిన కోర్సు ఇది. మెడికల్‌ స్కూల్‌ గ్రాడ్యుయేట్స్‌, ఆప్తాల్మాలజిస్టులు, ఆప్టో మెట్రిస్ట్‌లు, ఈ రంగంపై  ఆసక్తి ఉన్న ఇంజనీర్లకు సంబంధించి ఇదో ఐడియల్‌ కోర్సు అని చెప్పవచ్చు. రెండేళ్ళలో కలిపి 52 క్రెడిట్స్‌ ఉంటాయి. మొదటి ఏడాదిలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌ 14 క్రెడిట్స్‌ ఉంటాయి. ఈ రెండు సెమిస్టర్లలో కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌, ఇండస్ట్రీ లెక్చర్స్‌ తప్పనిసరి. బాస్కెట్‌ కోర్సుల నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. ఒక్కో దానిఓ 12 క్రెడిట్స్‌ చొప్పున రెండో ఏడాదిలో మరో రెండు సెమిస్టర్లు ఉంటాయి. రెండు సంస్థల పర్యవేక్షణలో ప్రాజెక్ట్‌ వర్క్‌ కూడా ఉంటుంది. కోర్సును ఆరంభిస్తున్న సంద్భంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, ఎల్వీపీఈఐ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గర్గ్‌ తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 


ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ పోర్టల్‌: https://iith.ac.in/mtechadmissions/        

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 7  

ప్రోగ్రామ్‌ వెబ్‌పేజీ లింక్‌: https://ope.cip.iith.ac.in/

Updated Date - 2022-06-20T21:30:31+05:30 IST