లోకేష్ కనగరాజ్‌కి మైత్రీ మూవీస్ ఆఫర్..?

Jun 9 2021 @ 12:29PM

లోకేష్ కనగరాజ్‌కి మైత్రీ మూవీస్ ఆఫర్ ఇచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన 'శ్రీమంతుడు' సినిమాతో ప్రొడక్షన్ మొదలు పెట్టారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి దాదాపు అన్నీ పెద్ద సినిమాలే రూపొందుతున్నాయి. అగ్ర దర్శకులు - హీరోల కాంబినేషన్‌లో ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి మైత్రీ మూవీస్ నిర్మాతలు భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలో ఒక స్టార్ హీరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. 2016లో 'ఏవియల్‌'తో కోలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్‌ 'ఖైదీ', మాస్టర్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. ప్రస్తుతం తమిళంలో మంచి క్రేజ్ ఉన్న ఈయన లోకనాయకుడు కమల్ గాసన్‌తో 'విక్రమ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.