రివర్స్‌ పీఆర్సీతో చాలా నష్టం

ABN , First Publish Date - 2022-01-27T05:04:45+05:30 IST

రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులు చాలా నష్టపోతారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు.

రివర్స్‌ పీఆర్సీతో చాలా నష్టం
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న జేఏసీల నాయకులు

  1. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
  2. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం 


కర్నూలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులు చాలా నష్టపోతారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా నాలుగు జేఏసీల నాయకులు కొండారెడ్డి బురుజు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ కచ్చితంగా రివర్స్‌ పీఆర్సీయేనని, దీనిని వ్యతిరేకిస్తూ అన్ని ప్రభుత్వ సంఘాలు ఏకతాటిపైకి రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తమవంతుగా పీఆర్సీపైన ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజేస్తామన్నారు. కేంద్ర పీఆర్సీ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇస్తానంటే ఉద్యోగులు చాలా నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా చైర్మన వీసీహెచ వెంగళరెడ్డి, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసింహులు, ఆయా సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు

పీఆర్సీ సాధన కోసం నాలుగు జేఏసీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు ధర్నా చౌక్‌ వద్ద గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. రివర్స్‌ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, మెరుగైన పీఆర్సీని అమలు చేయాలని, ఆశుతోశమిశ్రా రిపోర్టును బహిర్గతం చేయాలని తదితర డిమాండ్లతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ దీక్షలు చేయనన్నారు. 27న కర్నూలు డివిజన పరిధిలోని ఉద్యోగులు, 28న నంద్యాల డివిజన పరిధిలోని ఉద్యోగులు, 30న ఆదోని డివిజన పరిధిలోని ఉద్యోగులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. 


Updated Date - 2022-01-27T05:04:45+05:30 IST