మూడం పోయె..ఆషాఢం వచ్చె

ABN , First Publish Date - 2021-05-10T06:53:29+05:30 IST

ఏడాది కాలంగా పెళ్లిళ్లకు కొవిడ్‌ యమ గండంగా మారింది. శ్రావణం, కార్తీక మాసాల బదు లు కొంతమంది మాఘమాసంలో పెళ్లిళ్లు చేద్దా మనుకున్నారు. అయితే నాలుగు నెలల పాటు మూఢం వచ్చి వివాహాలకు బ్రేక్‌ వేసింది.

మూడం పోయె..ఆషాఢం వచ్చె

కళ తప్పిన శుభకార్యాలు

 ఏడాది కాలంగా పెళ్లిళ్లకు కొవిడ్‌ యమ గండంగా మారింది.  శ్రావణం, కార్తీక మాసాల బదు లు కొంతమంది మాఘమాసంలో పెళ్లిళ్లు చేద్దా మనుకున్నారు.  అయితే నాలుగు నెలల పాటు మూఢం వచ్చి వివాహాలకు బ్రేక్‌ వేసింది. మే 6 నుంచి మహూర్తాలు ఉన్నాయని అందరూ సమాయత్తమయ్యారు.  ముహూర్తాల కంటే ముందుగా కొవిడ్‌ పల్లెల్లో కూడా వ్యాపించడంతో ప్రభుత్వ ఆంక్షలతో చాలా మంది మీమాంసలో పడ్డారు. ఇది లా ఉంటే శుభకార్యాలపై ఆధాపడి జీవనాన్ని సాగిస్తున్న ఫొటోగ్రాఫర్లు, పురోహి తులు, సప్లయర్స్‌ తో పాటు బుకింక్‌లులేక ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు ఎన్నడూలేనివిధంగా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. 

  - భూదాన్‌పోచంపలి

జిల్లాలో గత వేసవిలో కొవిడ్‌ ప్రభావంతో వేలాది వివాహాలు వాయిదాపడ్డాయి. కొందరు ఇళ్లలో, ఆల యాల్లో, కుటుంబీల సమక్షంలో సాదాసీదాగా పెళ్లిళ్లు చేశారు. మే ఆరో తేదీ నుంచి  శుభమూహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. అయితే రోజురోజుకూ తీవ్రమవుతోన్న కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో  పలువురు వివాహాలను వాయిదా వేసుకోగా, ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న వారు సాదాసీదాగా నిర్వహించుకునేందుకు మొగ్గు చూపు తున్నారు. దీంతో పెళ్లిళ్లతో ఉపాఽధిపొందేవారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  

అనుమతి ఉంటేనే..

ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా ఆయా మండలాల తహసీల్దార్ల నుంచి  అనుమతి తీసుకోవా లి. కొవిడ్‌ రెండో దశ కట్టడిలో భాగంగా సమూహాలను నియంత్రించేందుకు ప్రకృతి విపత్తుల నివారణ చట్టాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వివాహానికి 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పురోహితు డు, వరుడు, వధువు వారి కుటుంబ సభ్యులతో పాటు గరిష్ఠంగా 50మంది మించవద్దని సూచిస్తున్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వధూవరుల ఇళ్లు, కల్యాణ మండపం ఉంటే అనుమతి ఇవ్వడం లేదు. ఇతర శుభకార్యాలపైనా రెవెన్యూ యంత్రాంగం నిఘా పెట్టింది. 

 పలు రంగాలపై ప్రభావం

 ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వేల వివా హాలు ఉంటాయని పురోహితుల అంచనా. కొవిడ్‌ ఉధృతితో చాలామంది వివాహాలను వాయిదా వేసుకోవడంతో వీటిపై ఉపాధి పొందే వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 కల్యాణ మండపం డెకరేషన్‌ చేసే వర్కర్లు, ఈవెంట్‌ నిర్వాహకులు, పురోహితులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్‌ మేళం నిర్వాహకులు,  వస్త్ర, బంగారు వ్యాపారులు, టెంట్‌ హౌస్‌ నిర్వాహకులు ఇలా అనేక రంగాల్లో ఆధారపడిన వారి ఉపాధిపై ప్రభా వం చూపుతోంది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. 

ఏడాదిగా గిరాకీ లేదు  

కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్నందున పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అడ్వాన్సులు ఇచ్చిన వారు వాయిదా వేయడంతో పలు ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే ఏడాదిగా గిరాకీ లేక ఉపాధికి కష్టంగా మారింది. 

- బోగ చంద్రశేఖర్‌, ఫొటోగ్రాఫర్‌, పోచంపల్లి 

దిక్కుతోచడం లేదు

ఏడాది క్రితం లక్షలు వెచ్చించి డిజిటల్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌ తీసుకున్నాం. శుభకార్యాలు లేక అప్పు లుతెచ్చి వడ్డీ చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇకనైనా పెళ్లిళ్లు సజావుగా జరుగుతాయని ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగిలింది. 

- పాండు, భూదాన్‌పోచంపల్లి 

ఇప్పుడూ గడ్డు పరిస్థితే

ఇప్పుడు శుభకార్యాలు, పెళ్లిళ్లు నిరాడంబరంగా చేస్తున్నందున ఫొటో, వీడియోగ్రాఫర్లకు గిరాకీ లు తగ్గింది. ఎంతోమంది ఈ సీజన్‌ పై ఆశలు పెట్టుకున్నా గత ఏడాదిలాగానే నిరుత్సా హంగా ఉంది. మా పరిస్థితి అధ్వానంగా మారింది. 

- దోర్నాల భావనారుషి, భూదాన్‌పోచంపల్లి 

తప్పని పరిస్థితుల్లో వెళుతున్నాం

తప్పని పరిస్థితుల్లో వివాహానికి వెళుతున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుని రెండు మాస్కులు ధరిస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుత పరి స్థితుల్లో శుభకార్యాలు వాయిదా వేసుకోవడం ఉత్త మం. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. కార్యక్ర మాల్లో భౌతికదూరం పాటించడం సాధ్యపడటం లేదు. అందుకే వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.

- మహంకాళి శ్రీనివాస్‌శర్మ, పురోహితుడు


Updated Date - 2021-05-10T06:53:29+05:30 IST