‘బంగార్రాజు’కు ముహూర్తం కుదిరింది!

Aug 2 2021 @ 12:00PM

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రంగా బంగార్రాజును తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈయన హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొంద‌నుంది. ఇందులో నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైత‌న్య జోడీ కృతి శెట్టి క‌నిపించ‌నుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ఆగ‌స్ట్ 20 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. సినిమా కోసం ఓ సెట్‌ను కూడా వేస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని కూడా టాక్‌. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.