బ్రిటన్ ‘స్టోక్‌పార్కు్’... అంబానీ వశం...

ABN , First Publish Date - 2021-04-23T22:01:39+05:30 IST

బ్రిటన్‌ సంస్థ ‘స్టోక్‌పార్కు్’... ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పరమైంది.

బ్రిటన్ ‘స్టోక్‌పార్కు్’... అంబానీ వశం...

ముంబై : బ్రిటన్‌ సంస్థ ‘స్టోక్‌పార్కు్’... ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పరమైంది. హోటల్‌తో పాటు గోల్ఫ్‌కోర్స్ కలిగిన స్టోక్‌పార్కు... బ్రిటన్‌‌లోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. ఈ ఒప్పందం వ్యాల్యూ రూ. 592 కోట్లు. ఈ క్రమంలో... రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్‌పార్క్ కూడా భాగం కానుంది.


ఇంధనేతర రంగంలోకి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ముఖేష్ అంబానీ ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆట బొమ్మల సంస్థ హామ్లేస్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్‌లోకి కూడా అంబానీ ప్రవేశించారు. కాగా... గత కొంతకాలం నుండి ఆయా దేశాలకు చెందిన పేరెన్నికగన్న సంస్థలను అంబానీ... తన సామ్రాజ్యంలో కలుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో... బ్రిటన్‌కే చెందని మరికొన్ని సంస్థలను కూడా కొనుగోలు చేసేందుకు అంబానీ యోచిస్తున్నట్లు రిలయన్స్ వర్గాల నుంచి వినవస్తోంది. 

Updated Date - 2021-04-23T22:01:39+05:30 IST