ముల్తానీ మట్టితో మేనికి మెరుపు

ABN , First Publish Date - 2022-03-21T18:30:27+05:30 IST

వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని సౌందర్యనిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇది స్కిన్‌ ఆయిల్స్‌ను

ముల్తానీ మట్టితో మేనికి మెరుపు

ఆంధ్రజ్యోతి(21-03-2022)

వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని సౌందర్యనిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇది స్కిన్‌ ఆయిల్స్‌ను నియంత్రిస్తుంది. చర్మ రంధ్రాల్లో నుంచి దుమ్మును పోగొడుతుంది. చర్మరంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. అధికంగా ఉన్న సెబమ్‌ను గ్రహిస్తుంది. ముఖ్యంగా ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి ఇది మంచి ఫేస్‌ప్యాక్‌. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకుని పావుగంట తరువాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.


Updated Date - 2022-03-21T18:30:27+05:30 IST