మల్టీ డివైస్‌ సపోర్ట్‌ను వాడుకోండి

ABN , First Publish Date - 2021-09-18T06:30:28+05:30 IST

మల్టీ డివైజ్‌ కనెక్టింగ్‌ కోసం వాట్సాప్‌ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. డివైస్‌ల సమీపంలో సెల్‌ఫోన్‌ లేనప్పటికీ ఒకేసారి నాలుగు డివైస్‌లలో వాట్సాప్‌ లింక్‌ చేసుకోవచ్చు...

మల్టీ డివైస్‌ సపోర్ట్‌ను వాడుకోండి

మల్టీ డివైజ్‌ కనెక్టింగ్‌ కోసం వాట్సాప్‌ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. డివైస్‌ల సమీపంలో సెల్‌ఫోన్‌ లేనప్పటికీ ఒకేసారి నాలుగు డివైస్‌లలో వాట్సాప్‌ లింక్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోమ్మని వాట్సాప్‌ ఇటీవల తన వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. డబ్ల్యూఎబేటాఇన్ఫో విడుదల చేసిన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం వాట్సాప్‌ వినియోగం కోసం ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. వెబ్‌, డెస్క్‌టాప్‌, ఇతర డివైసెస్‌లలో అందుబాటులోకి వస్తోంది. ఒక స్మార్ట్‌ఫోన్‌కు తోడు నాలుగు డివైసెస్‌ల్లో ఒకేసారి వాట్సాప్‌ను లింక్‌ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఎండ్‌టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయని స్పష్టం చేసింది. వేర్వేరు డివైస్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బేటా ప్రోగ్రామ్‌లో చేరాలని వాట్సాప్‌ వినియోగదారులను కోరుతున్నట్టు సదరు బ్లాగ్‌ తెలిపింది. 



కాల్‌ మధ్యలోనూ చేరొచ్చు!


గ్రూప్‌ కాల్‌లోకి సరైన సమయంలో చేరలేకపోయామనే చింత ఇకపై ఉండదు. సహ ఉద్యోగులు లేదంటే బంధుమిత్రులు ఏర్పాటు చేసుకున్న గ్రూప్‌ కాల్‌లో నిర్దేశిత సమయానికి అందుకోలేకపోయిన వ్యక్తులు అందులో చేరేందుకు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. దీంతో వీడియో కాల్‌ పూర్తిగా మిస్‌ కాకుండా చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో గ్రూప్‌ కాల్‌ మధ్యలో చేరొచ్చు. అలాగే మధ్యలోనే కాల్‌ నుంచి బైటకు వచ్చేయవచ్చు. కాల్‌ లాగ్స్‌లోనే ఇందుకోసం ‘టాప్‌ టు జాయిన్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. అప్‌డేట్‌ చేసిన వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌లో ఈ సౌలభ్యం ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే..


  1. వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి ఆన్‌ కాల్స్‌ను టాప్‌ చేయాలి.
  2. కాల్‌ లాగ్‌ టాప్‌లో టాప్‌ చేసేందుకు జాయిన్‌ ఆప్షన్‌ ఉంటుంది. 
  3. గ్రూప్‌ కాల్‌పై టాప్‌ చేసి, గ్రూప్‌ కాల్‌లో చేరేందుకు జాయిన్‌పై ప్రెస్‌ చేయండి. 

Updated Date - 2021-09-18T06:30:28+05:30 IST