Multibagger Stocks నుంచి మల్టీబెగ్గర్‌గా మారిన స్టాక్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-08-09T17:40:19+05:30 IST

షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన్నప్పుడు.. మనం ఇన్వెస్ట్ చేసిన షేర్లు విలువను కోల్పేయే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

Multibagger Stocks నుంచి మల్టీబెగ్గర్‌గా మారిన స్టాక్స్ ఇవే..

Multibagger Stocks : షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన్నప్పుడు.. మనం ఇన్వెస్ట్ చేసిన షేర్లు విలువను కోల్పేయే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఒక అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేయడానికి ముందు మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం అన్వేషిస్తారు. అయితే ఏ స్టాక్ కూడా ది బెస్ట్ అని చెప్పలేం. 10 ఏళ్ల పాటు మల్టీబ్యాగర్ రిటర్న్ అందించిన స్టాక్‌లు సైతం 11వ ఏడు కుప్పకూలవచ్చు. అంటే ది బెస్ట్ స్టాక్స్‌కు కూడా గ్రహణం పట్టే అవకాశం లేకపోలేదు.


Unitech, Suzlon Energy, Rcom గురించి తెలుసా? ఈ కంపెనీలు ఒకప్పుడు మార్కెట్ డార్లింగ్‌గా ఉండేవి. వారు భారీ మల్టీబ్యాగర్ లాభాలను అందించారు. కానీ కాలం కలిసిరాకపోవడంతో ఈ స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. విపరీతమైన నష్టాల్లోకి కూరుకుపోయాయి. అటువంటి నాలుగు స్టాక్‌ల జాబితాను ఈ రోజు మేము మీకు అందిస్తున్నాము.


పీసీ జువెలర్స్..


2018లో PC జ్యువెలర్ షేర్ ధర గరిష్టంగా రూ.600 వద్ద ఉంది. కానీ నేడు ఇది రూ.55 కంటే తక్కువ ధర కలిగిన పెన్నీ స్టాక్. జనవరి 2018లో ఈ స్టాక్ రూ.230 బిలియన్ల మార్కెట్‌క్యాప్‌ను కలిగి ఉండగా, అక్టోబర్ 2018లో పీసీ జువెలర్స్ మార్కెట్‌క్యాప్ రూ.19 బిలియన్లకు చేరుకుంది. 10 నెలల వ్యవధిలో 90% పైగా సంపద హరించుకుపోయింది. కంపెనీ షేర్లు 2016- 2018 మధ్య కాలంలో భారీగా పెరిగాయి. నవంబర్ 2016లో రూ.150 నుంచి జనవరి 2018 నాటికి స్టాక్ రూ.590కి పెరిగింది. ఆ తరువాత పతనం ప్రారంభమైంది. పీసీ జువెలర్స్ ప్రస్తుతం బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వెండి వస్తువుల తయారీ, విక్రయం వ్యాపారంలో నిమగ్నమై ఉంది. 


యెస్ బ్యాంక్..


యెస్ బ్యాంక్ షేరు ధర ఆగస్ట్ 2018లో దాని ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి రూ.393 నుంచి రూ.11కి పడిపోయింది. ఆగస్ట్ 2018లో రూ.908 బిలియన్ల మార్కెట్‌క్యాప్‌ను కలిగి ఉన్న ఈ స్టాక్ తర్వాతి రెండేళ్లలో రూ.270 బిలియన్ల మార్కెట్‌క్యాప్‌తో రూ.11కి పడిపోయింది. 2008 తర్వాత, యెస్ బ్యాంక్ సుమారు రూ.350 బిలియన్ల రుణాలను అందించిందని, వాటిలో ఎక్కువ భాగం రికవరీ అవలేదని తెలుస్తోంది. తమ వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్న కంపెనీలకు రుణాలు ఇచ్చి యస్ బ్యాంకు చిక్కుల్లో పడింది. రుణాలు తీసుకున్న కంపెనీలలో అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, DHFL, IL&FS ఉన్నాయి.


3. హెచ్‌డీఐఎల్..


రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ముందే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించి అపఖ్యాతి పాలయ్యాయి. పెరుగుతున్న రియాల్టీ మార్కెట్‌లో ఇది పేకమేడలా కూలిపోయింది. ప్రాజెక్ట్‌ను ఎంత ఆలస్యం చేస్తే, కొనుగోలుదారు నుంచి అంత అధికంగా ధరలు వసూలు చేయవచ్చు. తద్వారా లాభాలు సైతం భారీగానే పొందవచ్చు. అయితే ఇది అన్నివేళలా అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తగినంత నిధులను సేకరించడం కష్టమవుతుంది. లాభాలు గూబల్లోకి వస్తాయి. హెచ్‌డీఐఎల్ విషయంలోనూ ఇదే జరిగింది. జూలై 2007లో ఐపీఓ తర్వాత, HDIL షేర్ ధర మరుసటి సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. జనవరి 2008లో రూ.434 నుంచి రూ.1,084కి పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ గరిష్టంగా రూ.299 బిలియన్లకు చేరుకుంది. HDIL భారతదేశంలో మూడవ అతిపెద్ద రియల్టీ డెవలపర్‌గా పరిగణించబడుతోంది. ఇక డిసెంబర్ 2008 తర్వాత షేర్ ధర రూ.20.4 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రూ.70కి పడిపోయింది.


4. డీహెచ్ఎఫ్ఎల్(DHFL)..


1998 నుంచి 2008 మధ్య కాలంలో డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు 2,000% పైగా పెరిగి, రూ.5.5 నుంచి 2008లో గరిష్టంగా రూ.120కి చేరాయి. తరువాత 2009లో 75% పైగా క్షీణించి రూ.25కి పడిపోయింది. మళ్లీ కంపెనీ 2009లో తన పునర్నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించింది. 2009 కనిష్ట స్థాయి నుంచి సెప్టెంబర్ 2018లో డీహెచ్ఎఫ్ఎల్ గరిష్టంగా రూ.678కి చేరుకుంది. కానీ బ్యాంకేతర ఫైనాన్స్ సంస్థ(NBFC)లకు రుణ సమస్య వచ్చి పడింది. ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు, డీహెచ్ఎఫ్ఎల్ కూడా దారుణంగా పతనమైంది.


Updated Date - 2022-08-09T17:40:19+05:30 IST