కరోనా నిబంధనల పేరుతో ఎస్‌ఐ పైశాచికత్వం

ABN , First Publish Date - 2021-05-15T16:29:32+05:30 IST

జిల్లాలోని ఏటూరు నాగారంలో పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారు.

కరోనా నిబంధనల పేరుతో ఎస్‌ఐ పైశాచికత్వం

ములుగు: జిల్లాలోని ఏటూరు నాగారంలో పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారు. మాస్క్ పెట్టుకోలేదని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేణు అనే బీ.ఫార్మసీ విద్యార్థిని ఎస్‌ఐ శ్రీకాంత్ ఒళ్ళు కమిలి పోయేలా కర్రలతో చితకబాదాడు. ఎస్‌ఐ దెబ్బలతో ఒళ్ళంతా వాతలతో, తీవ్ర గాయలపాలైన బాధితుడు వేణు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా నిబంధనల పేరుతో ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ప్రొబిషనరీ ఎస్ఐ తనను గొడ్డును బాదినట్లు బాధారని కేటీఆర్‌, డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు ట్విట్టర్ ద్వారా బాధితుడు పిర్యాదు చేశాడు. తన పేరు బయటకు చెబితే వేరే కేసులు పెట్టి జైళ్లో వేస్తానని ఎస్‌ఐ బెదిరించాడని బాధిత విద్యార్థి, అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-15T16:29:32+05:30 IST