నెహ్రూ యువకేంద్ర వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-02-28T05:00:22+05:30 IST

నెహ్రూ యువకేంద్ర వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

నెహ్రూ యువకేంద్ర వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

 ములుగు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: నెహ్రూ యువకేంద్ర వరంగల్‌ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వలంటీర్లుగా పనిచేసే ందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్‌ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. హన్మకొండలోని న్యూ బస్టాండ్‌ పక్కన గల యూత్‌హాస్టల్‌లో అభ్యర్థు లకు మార్చి 2న ఇంట ర్వ్యూ జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కనీసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఎన్‌ఎస్‌ఎస్‌, క్రీడలు, కల్చరల్‌ కార్యక్రమాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కనీస వయసు 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమవెంట ఫొటో, టీసీ, పుట్టినతేదీ, కులం, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకురావాలని అన్నారు. పూర్తి వివరాలకు 0870-2958776, 8328179465  నంబర్లను సంప్రది ంచాలని ఆయన సూచించారు. 



Updated Date - 2021-02-28T05:00:22+05:30 IST