IndiGo aircraft: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం...ప్రయాణికులను సురక్షితంగా దించిన నేవీ

ABN , First Publish Date - 2022-08-24T13:11:27+05:30 IST

ముంబయికు(Mumbai) వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది....

IndiGo aircraft: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం...ప్రయాణికులను సురక్షితంగా దించిన నేవీ

పనాజీ(గోవా): ముంబయికు(Mumbai) వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.గోవా(Goa) నుంచి ముంబయికి వెళ్లే ఇండిగో ఎయిర్‌బస్ వీటీ-ఐజడ్ఆర్ (VT-IZR) విమానం(IndiGo aircraft) మధ్యాహ్నం గోవా విమానాశ్రయం(Goa airport) రన్‌వేపైకి(runway) వెళుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఇండిగో ఎయిర్‌బస్ కుడి ఇంజిన్‌లో పొగ వచ్చింది. పైలట్‌కు మొమెంటరీ ఇంజనులో సాంకేతిక లోపం ఉన్నట్లు హెచ్చరిక వచ్చింది.దీంతో పైలట్(Pilot) తనిఖీ కోసం విమానాన్ని అధికారులకు ఇచ్చారు.


విమానంలో నలుగురు శిశువులతో సహా 187 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరినీ భారత నావికాదళానికి(Indian Navy) చెందిన రెస్క్యూ బృందాలు సురక్షితంగా కిందకు దించాయని గోవా విమానాశ్రయ డైరెక్టర్ ఎస్‌విటి ధనంజయరావు చెప్పారు.ఈ ప్రయాణికులను ముంబయికి మరో విమానంలో పంపించామని ఇండిగో అధికారులు చెప్పారు.ఇటీవల తరచూ విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తుతోంది. నేవీ బృందాలు విమానాన్ని ట్యాక్సీ బేకు తీసుకెళ్లాయి.రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గోలో కూడా పొగ వచ్చింది.


Updated Date - 2022-08-24T13:11:27+05:30 IST