Union Minister నారాయణ్ రాణేకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాక్

ABN , First Publish Date - 2022-03-15T12:59:10+05:30 IST

కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది....

Union Minister నారాయణ్ రాణేకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాక్

ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది.ముంబై సబర్బన్ జుహు  ప్రాంతంలోని తన బంగ్లాలో అనధికారిక నిర్మాణాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను కోరినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు.అక్రమ నిర్మాణం గురించి బీజేపీకి చెందిన కేంద్రమంత్రి రాణేకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గత వారం నోటీసు జారీ చేశారు.నిర్ణీత సమయంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే, మున్సిపాలిటీ కూల్చివేస్తుందని, కూల్చివేత చార్జీలను కేంద్రమంత్రి నుంచి రికవరీ చేస్తామని మున్సిపల్ అసెస్మెంట్ విభాగం తెలిపింది.అక్రమ నిర్మాణం కూల్చివేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 475 ఎ కింద ప్రాసిక్యూషన్ చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రమంత్రిని హెచ్చరించింది. 


Updated Date - 2022-03-15T12:59:10+05:30 IST