Union minister నారాయణ్ రాణే, అతని కుమారుడికి యాంటిసిపేటరి బెయిల్

ABN , First Publish Date - 2022-03-16T18:18:29+05:30 IST

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మేనేజర్ దివంగత దిశా సాలియన్ పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణే, అతని కుమారుడు నితీష్‌కు ముంబై కోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది....

Union minister నారాయణ్ రాణే, అతని కుమారుడికి యాంటిసిపేటరి బెయిల్

ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మేనేజర్ దివంగత దిశా సాలియన్ పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణే, అతని కుమారుడు నితీష్‌కు ముంబై కోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే, నితీష్‌ రాణేలు తమ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని సాలియన్‌ మృతిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని ముంబై పోలీసులు గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దిశ తల్లి వాసంతి సాలియన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.దీనికి ముందు వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సాలియన్ కుటుంబ పరువు తీశారని నారాయణ్ రాణే, నితేష్ రాణే,ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాసంతి సాలియన్ మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ ని ఆశ్రయించారు.


ఈ నెల ప్రారంభంలో ముంబై కోర్టు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే,అతని కుమారుడు నితీష్ రాణేలను అరెస్టు చేయకుండా మార్చి 10 వరకు మధ్యంతర రక్షణను మంజూరు చేసింది. దిశా సాలియన్ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇద్దరూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.రాజ్‌పుత్ (34) సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని కనిపించడానికి ఆరు రోజుల ముందు, అంటే జూన్ 8, 2020న సబర్బన్ మలాడ్‌లోని ఎత్తైన భవనంపై నుంచి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది.

Updated Date - 2022-03-16T18:18:29+05:30 IST