‘ఇదే నా చివరి ఉదయం కావచ్చు. నేను మళ్లీ మిమ్మల్ని కలవకపోవచ్చు’

ABN , First Publish Date - 2021-04-21T21:56:04+05:30 IST

దేశంలో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గొప్ప, పేద అనే తేడా లేకుండా వైరస్‌ అందరి ఉసురు తీస్తోంది. రోగులకు వైద్యం అందించే డాక్టర్లను సైతం కరోనా వదలిపెట్టట్లేదు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన మరుసటి రోజే కరోనాతో ఓ డాక్టర్ చనిపోయారు.

‘ఇదే నా చివరి ఉదయం కావచ్చు. నేను మళ్లీ మిమ్మల్ని కలవకపోవచ్చు’

ముంబై: దేశంలో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గొప్ప, పేద అనే తేడా లేకుండా వైరస్‌ అందరి ఉసురు తీస్తోంది. రోగులకు వైద్యం అందించే డాక్టర్లను సైతం కరోనా వదలిపెట్టట్లేదు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన మరుసటి రోజే కరోనాతో ఓ డాక్టర్ చనిపోయారు. ఈ విషాద ఘటన ముంబైలో జరిగింది. మనీషా జాదవ్ అనే 51ఏళ్ల డాక్టర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో రోజురోజుకీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించసాగింది. అది గ్రహించిన ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ఇదే నా చివరి ఉదయం కావచ్చు. నేను మళ్లీ మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. శరీరం సహకరించడంలేదు. ఆత్మ లేదు. కానీ అది అమరత్వం’ అని మనీషా పోస్టు చేసిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశంలో గడిచిన 24గంటల్లో 2.9లక్షలు నమోదయ్యాయి.

Updated Date - 2021-04-21T21:56:04+05:30 IST