రాజస్థాన్‌పై టాస్ గెలిచిన ముంబై.. నేడైనా బోణీ కొట్టేనా?

Published: Sat, 30 Apr 2022 19:10:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజస్థాన్‌పై టాస్ గెలిచిన ముంబై.. నేడైనా బోణీ కొట్టేనా?

ముంబై: రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముంబైకి ఇది 9వ మ్యాచ్. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓడిన ముంబై ఖాతా తెరిచేందుకు నానా పాట్లు పడుతోంది.


ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు మృగ్యమైన వేళ ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు, 8 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో విజయం సాధించిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.