IPL: టాస్ గెలిచిన ముంబై.. Suryakumar Yadav అవుట్

ABN , First Publish Date - 2022-05-10T00:50:56+05:30 IST

ఐపీఎల్‌లో నేడు ప్రాధాన్యం లేని మ్యాచ్ జరగబోతోంది. ఇందుకు డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక కాబోతోంది. ప్లే ఆఫ్స్‌పై

IPL: టాస్ గెలిచిన ముంబై.. Suryakumar Yadav అవుట్

ముంబై: ఐపీఎల్‌లో నేడు ప్రాధాన్యం లేని మ్యాచ్ జరగబోతోంది. ఇందుకు డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక కాబోతోంది. ప్లే ఆఫ్స్‌పై ఏమాత్రం ఆశలు లేని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)-కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రస్తుతం  కేకేఆర్ కింది నుంచి రెండో స్థానంలో ఉండగా, ముంబై అట్టడుగున ఉంది.


నేటి ఫలితంతో ఈ రెండు జట్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మూడుసార్లు కేకేఆర్ ఓడిపోవడం గమనార్హం. ఇక, ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ (Surya Kumar Yadav) యాదవ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడం ఆ జట్టుకు ఎదురుదెబ్బే. అతడి స్థానంలో రమణ్‌దీప్ జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా జట్టులో ఏకంగా ఐదు మార్పులు చోటుచేసుకున్నాయి. రహానే, కమిన్స్, వెంకటేశ్ అయ్యర్, చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ జట్టులోకి వచ్చారు. 

Read more