IPL: చెన్నైపై టాస్ గెలిచిన ముంబై

ABN , First Publish Date - 2022-05-13T01:01:12+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో

IPL: చెన్నైపై టాస్ గెలిచిన ముంబై

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ముంబై, చెన్నై చెరో 11 మ్యాచ్‌లు ఆడాయి.


ముంబై రెండింటిలో విజయం సాధించి అట్టడుగున ఉండగా, నాలుగింటిలో విజయం సాధించిన చెన్నై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో జయాపజయాలతో ఇరు జట్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. చెన్నై 8 పాయింట్లు ఉన్న చెన్నై గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగానే ఉంటుంది.


ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు 10 పాయింట్లు వస్తాయి. ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ రెండింటిలో గెలిచినా 14 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఆ లెక్కన చూసుకున్నా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే. ఇక, ముంబై ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. కాబట్టి ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి.

Read more