గాయపడిన అర్షద్ ఖాన్.. ముంబై జట్టులోకి కుమార్ కార్తికేయ

Published: Thu, 28 Apr 2022 16:17:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గాయపడిన అర్షద్ ఖాన్.. ముంబై జట్టులోకి కుమార్ కార్తికేయ

ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ముంబై ఆటగాడు మహమ్మద్ అర్షద్ ఖాన్ స్థానాన్ని లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 20 లక్షల ధరతో కుమార్ కార్తికేయతో ముంబై ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ తెలిపింది. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన కుమార్ కార్తికేయ ఇప్పటి వరకు 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 19 లిస్ట్ ఎ గేమ్స్, 8 టీ20లు ఆడాడి వరుసగా 35, 18, 9 వికెట్లు తీసుకున్నాడు.  


కాగా, ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. తొలి విజయం కోసం కళ్లు  కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో ముంబైలో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.