హనీమూన్‌ కోసం వెళ్లి.. డ్రగ్స్ కేసులో జైలుపాలైన ముంబై దంపతులు..చివరికి!

ABN , First Publish Date - 2021-04-02T00:50:45+05:30 IST

హనీమూన్ కోసం ఖతర్ వెళ్లి.. డ్రగ్స్ రవాణా కేసులో కటాకటాలపాలైన ముంబై దంపతులు కొద్ది రోజుల క్రితం విడుదలై తాజాగా ఇండియాకు చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మహమ్మద్

హనీమూన్‌ కోసం వెళ్లి.. డ్రగ్స్ కేసులో జైలుపాలైన ముంబై దంపతులు..చివరికి!

ముంబై: హనీమూన్ కోసం ఖతర్ వెళ్లి.. డ్రగ్స్ రవాణా కేసులో కటాకటాలపాలైన ముంబై దంపతులు కొద్ది రోజుల క్రితం విడుదలై తాజాగా ఇండియాకు చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మహమ్మద్ షరీక్, ఒనిబా కౌసర్ షకీల్ అహ్మద్‌లకు 2019లో వివాహం జరిగింది. అనంతరం ఆ నవ దంపతులు హనీమూన్ కోసం ప్లాన్ చేసుకుంటుండగా.. డ్రగ్స్ మాఫియా వారిపై కన్నేసింది. హనీమూన్ ప్యాకేజ్ పేరుతో వారిని సంప్రదించింది. ఈ క్రమంలో హనీమూన్ ప్యాకేజీకి ఆ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డ్రగ్స్ మాఫియా తన ప్లాన్‌ను అమలు పరిచింది. తంబాకు పేరుతో లగేజీలో గంజాయిని పెట్టి, ఆ దంపతులను ఖతర్ పంపింది. కాగా.. ఎంజాయ్ చేసేందుకు ఖతర్ వెళ్లిన మహమ్మద్ షరీక్, ఒనిబా కౌసర్ షకీల్ అహ్మద్‌లకు ఖతర్ అధికారులు షాక్ ఇచ్చారు. 



లగేజీలో గంజాయిని గుర్తించిన ఖతర్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వారిని 2019 జూలై 6న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారికి 10సంవత్సరాల జైలు శిక్ష విధించడంతోపాటు భారీ జరిమానా విధించింది. కాగా.. ఈ విషయం తెలుసుకుని ఆ దంపతుల కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఆ క్రమంలోనే ఒనిబా కౌసర్ షకీల్ అహ్మద్ తండ్రి షకీల్ అహ్మద్ ఖురేషీ.. తన కూతురు, అల్లుడు నిర్ధోషులని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించే పని ప్రారంభించారు. తాజాగా వాటిని సేకరించి.. ఖతర్‌లోని ఇండియన్ అధికారుల ద్వారా ఖతర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలను పరీశీలించిన కోర్టు.. మహమ్మద్ షరీక్, ఒనిబా కౌసర్ షకీల్ అహ్మద్‌లను నిర్ధోషులుగా తేల్చింది. ఈ క్రమంలో బుధవారం రోజు వారు ఇండియాకు చేరుకున్నారు. 


Updated Date - 2021-04-02T00:50:45+05:30 IST