ముంబైలో 10,860 కొత్త కోవిడ్ కేసులు, positivity rate 34 శాతం ఎక్కువ

ABN , First Publish Date - 2022-01-05T02:15:18+05:30 IST

ముంబైలో 10,860 కొత్త కోవిడ్ కేసులు, positivity rate 34 శాతం ఎక్కువ

ముంబైలో 10,860 కొత్త కోవిడ్ కేసులు, positivity rate 34 శాతం ఎక్కువ

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం రోజు ముంబైలో 10,860 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది సోమవారంతో పోలిస్తే 34 శాతం ఎక్కువ అని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ వల్ల ఇద్దరు చనిపోయారు. మొత్తం 8,18,462 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. ముంబైలో నిన్న 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 16.3 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 18,466 కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 20 మంది చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. 75 మందికి కోవిడ్ కొత్త వైరస్ ఒమైక్రాన్ సోకిందని అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-01-05T02:15:18+05:30 IST