Swiggy Instamart లో కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. ఏ నగర వాసులు ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారంటే..!

ABN , First Publish Date - 2022-09-03T01:38:19+05:30 IST

స్విగ్గీ, జొమాటో, అమేజాన్ వంటి ఆన్‌లైన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇంటి నుంచి కదలకుండా తమకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తున్నారు.

Swiggy Instamart లో కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. ఏ నగర వాసులు ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారంటే..!

స్విగ్గీ, జొమాటో, అమేజాన్ వంటి ఆన్‌లైన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇంటి నుంచి కదలకుండా తమకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలైన వాటిని ఆన్‌లైన్ ద్వారా కొనేస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ (Swiggy Instamart) తమ వినియోగదారులు గతేడాది కాలంలో ఎక్కువగా ఆర్డర్ పెట్టిన వస్తువుల గురించి వెల్లడించింది. దాని ప్రకారం భారత ఆర్థిక రాజధాని ముంబైలో కండోమ్ అమ్మకాలు గతేడాది కాలంలో గణనీయంగా పెరిగాయట.


ఇది కూడా చదవండి..

పాపకు జన్మనిచ్చిన 9 రోజులకే ఓ తల్లికి కడుపుకోత.. నామకరణ వేడుక చేస్తుండగా జరిగిన ఒక్క ఘటనతో..


మెట్రో నగరాల్లో 10 నిమిషాల కిరాణా డెలివరీ పేరుతో సర్వీస్‌లను ప్రారంభించిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ బాగా ప్రజాదరణ పొందింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ప్రజలు ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ముంబై కస్టమర్లు ఈ ఏడాది ఆర్డర్ చేసిన కండోమ్‌ల సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 570 రెట్లు ఎక్కువట. మిగిలన నగరాలతో పోల్చుకుంటే కండోమ్‌ల వినియోగంలో ముంబై చాలా ముందు ఉందట. ఇక, గత రెండేళ్ల కాలంలో గుడ్లకు సంబంధించి 50 మిలియన్ ఆర్డర్‌లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఇక, మరో పోషకాహారమైన పాల కోసం 30 మిలియన్ల ఆర్డర్‌లు వచ్చాయట. 


మిగిలిన వాటితో పోల్చుకుంటే గుడ్లు, కండోమ్‌లు, శానిటరీ నాప్‌కిన్‌లు, టాంపాన్‌లు, తాజా జ్యూస్‌లు, ఇన్‌స్టంట్ న్యూడిల్స్ కోసం ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి కాబట్టి, ఆయా నెలలో ఐస్ క్రీం డిమాండ్ 42 శాతం పెరిగిందని, వాటికి సంబంధించి చాలా వరకు ఆర్డర్‌లు రాత్రి 10 గంటల తర్వాత వచ్చాయని పేర్కొంది. ఇక, దక్షిణాది అల్పాహారాలైన పోహా, ఉప్మా, దోశ రెడీ-టు-ఈట్ వెర్షన్‌లకు సంబంధించి ముంబై, ఢిల్లీలలో డిన్నర్ సమయంలో ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయట. 


Updated Date - 2022-09-03T01:38:19+05:30 IST