ఆమె చేసిన పొరపాటు ఖరీదు రూ.7లక్షలు!

ABN , First Publish Date - 2022-07-07T21:33:36+05:30 IST

సాధారణంగా మనం అందరం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ ఓ మహిళ చేసిన పొరపాటు విలువ మాత్రం రూ.7లక్షలు. పొరపాటు విలువ రూ.7లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నిజమే. బంధువులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయబోయి

ఆమె చేసిన పొరపాటు ఖరీదు రూ.7లక్షలు!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనం అందరం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ ఓ మహిళ చేసిన పొరపాటు విలువ మాత్రం రూ.7లక్షలు. పొరపాటు విలువ రూ.7లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నిజమే. బంధువులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయబోయి.. గుర్తు తెలియని వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు పంపించింది. అనంతరం పొరపాటు గ్రహించి.. తిరిగి తనకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా అతడిని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అతడి మాటలు విని ఆమె మైండ్ బ్లాంక్ అయింది. బ్యాంకు అధికారులు కూడా చేతులు ఎత్తేయడంతో చివరికి ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ముంబైకి చెందిన మహిళను ఆమె బంధువులు ఓ పని మీద డబ్బులు అడిగారు. దానికి ఆమె కూడా సరేనంది. వాళ్లు అడిగిన మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తానని మాటిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు బదిలీ చేయబోయి.. పొరపాటు చేసింది. తప్పుడు అకౌంట్ నెంబర్‌కు రూ.7లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత తన తప్పును గ్రహించి.. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించింది. అయితే అధికారులు.. చేతులెత్తేశారు. ‘మేం ఏం చేయలేం. పొరపాటు మీదే కాబట్టి దాన్ని మీరే సరిదిద్దు కోవాలి’ అని చెప్పేశారు. 



ఈ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో బ్యాంకు అకౌంట్ నెంబర్ ఆధారంగా అధికారులు అతడి వివరాలే సేకరించారు. ఈ క్రమంలో ఆ గుర్తు తెలియని వ్యక్తిని ఆమె సంప్రదించింది. తన డబ్బును తనకు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే దానికి అతడు నిరాకరించాడు. అంతేకాకుండా తాను ఆ డబ్బును లాటరీలో గెలుచుకున్నానని వాదించాడు. అతడి వైఖరితో విసిగిపోయిన ఆమె.. తిరిగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారుల.. తమ స్టైల్‌లో అతడికి వార్నింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతం అయింది. సదరు మహిళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కాగా.. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2022-07-07T21:33:36+05:30 IST