100వ పుట్టినరోజున కరోనా టీకా వేయించుకున్న వృద్ధురాలు..!

ABN , First Publish Date - 2021-03-07T03:14:37+05:30 IST

మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ వృద్ధురాలు తన నూరవ జన్మదినం సందర్భంగా తొలి కరోనా డోసు వేయించుకున్నారు.

100వ పుట్టినరోజున కరోనా టీకా వేయించుకున్న వృద్ధురాలు..!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ వృద్ధురాలు తన నూరవ జన్మదినం సందర్భంగా తొలి కరోనా డోసు వేయించుకున్నారు. 1921 మార్చి5న జన్మించిన పార్వతీ ఖేడ్కర్ మార్చి 5 తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బండ్రా కుర్లా కాంప్లెక్స్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. భారత్‌లో కరోనా టీకా పంపిణీ జనవరి 16న  ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి దశలో ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పొందే అవకాశాన్ని ఇచ్చింది. మార్చి 1 నుంచీ ప్రారంభమైన రెండో దశ టీకా కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 పైబడి దీర్ఘకాలిక రోగాలున్న వారికి టీకా వేస్తున్నారు. ఈ మారు ప్రభుత్వాస్పత్రులతో పాటూ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా లభించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. రోజువారి కరోనా కేసులు అక్కడ క్రమంగా పెరుగుతుండటంతో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-03-07T03:14:37+05:30 IST