first Electric Double Decker Bus: దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు

ABN , First Publish Date - 2022-08-18T13:17:12+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిలో(Mumbais) దేశంలోనే మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను(first Electric Double Decker Bus)...

first Electric Double Decker Bus: దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు

ముంబయి(మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిలో(Mumbais) దేశంలోనే మొట్టమొదటిసారి  ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను(first Electric Double Decker Bus) గురువారం నుంచి నడుపుతున్నారు. మొదటి ఎయిర్ కండీషన్ డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులను బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్( Brihanmumbai Electric Supply and Transport) గురువారం ప్రారంభించింది.ముంబయి నగరంలో డబుల్ డెక్కర్ ఏసీ బస్సు, మరో సింగిల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును(single-decker electric bus) అధికారులు ప్రారంభించారు.ఈ బస్సుల ప్రారంభ  కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ లు పాల్గొన్నారు. 


దేశంలోనే మొదటిసారి ముంబయి నగరంలో రోడ్లపై తిరుగుతున్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్సు, బ్లూ కలర్ సింగిల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (black and red double decker bus and blue coloured single decker bus have gone viral on social media) మారాయి. ముంబయి నగరంలో 900 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. 450 బస్సులు వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లపైకి ఎక్కనున్నాయి.(first air conditioned double decker bus in the country) ఈ బస్సుల్లో ప్రయాణానికి ప్రీమియం యాప్ ను(app-based premium bus service) రూపొందించారు.


ఈ ప్రీమియం బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణికులు మొబైల్ యాప్ సాయంతో సీట్లను బుక్ చేసుకోవచ్చని ముంబయి అధికారులు చెప్పారు. ముంబయి నగరంలో బెస్ట్ సంస్థ 3,700 బస్సుల్లో రోజుకు 75 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. 




Updated Date - 2022-08-18T13:17:12+05:30 IST