అన్విక కోసం ముమ్మర గాలింపు

ABN , First Publish Date - 2022-08-11T06:35:46+05:30 IST

అన్విక కోసం ముమ్మర గాలింపు

అన్విక కోసం ముమ్మర గాలింపు
గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

 అదృశ్యమైన బాలిక కిడ్నాపైందా లేక బుడమేరులో గల్లంతైందా? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు..  రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 10: విస్సన్నపేట నుంచి బం ధువుల ఇంటికి వచ్చి అదృశ్యమైన మూడేళ్ల బాలిక అన్విక కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అదృశ్యమైన బాలిక కిడ్నాప్‌నకు గురైందా? లేక ప్రమాదవశాత్తు బుడమేరులో పడి గల్లంతైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విస్సన్న పేటకు చెందిన కనకదుర్గ, చెన్నారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. నగరంలోని బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో ఓ శుభకార్యానికి మంగ ళవారం హాజరయ్యారు. తల్లిదండ్రులతో ఉన్న పెద్దకుమార్తె అన్విక మధ్యాహ్నం కనిపించలేదు. చుట్టుపక్కల వెదికినా ప్రయోజనం లేకపోవ డంతో కుటుంబసభ్యులు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కిడ్నాప్‌నకు గురైందా లేక బుడమేరులో గల్లంతైందా అనే దానిపై పోలీసులు బృందాలుగా విడిపోయి నగరంలోని పలు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరో పక్క ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి బుడ మేరును జల్లెడపడుతున్నారు. 15 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం దేవీ టవర్స్‌ నుంచి ట్రెండ్‌సెట్‌ మెడోస్‌ వరకు ఉదయం 10 గంటల నుంచి ముమ్మరంగా గాలించారు. సాయంత్రం 6 గంటల వరకు గాలించి, చీకటి పడటంతో నిలిపివేశారు. గురువారం మళ్లీ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మళ్లీ గాలించనున్నారు.

 





Updated Date - 2022-08-11T06:35:46+05:30 IST