ఎడారిలో ఊహించని రీతిలో ’అది‘ ప్రత్యక్షం... తలలు పట్టుకుంటున్న అధికారులు!

ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST

ఎడారిలో వేల ఏళ్ల నాటి అస్థిపంజరం కనిపించింది.

ఎడారిలో ఊహించని రీతిలో ’అది‘ ప్రత్యక్షం... తలలు పట్టుకుంటున్న అధికారులు!

ఎడారిలో వేల ఏళ్ల నాటి అస్థిపంజరం కనిపించింది. పొడి చర్మం, తలపై వెంట్రుకలు ఉండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అస్థిపంజరం చిలీలోని అటకామా ఎడారిలో పురావస్తుశాఖ అధికారులకు కనిపించింది. ఈ అస్థిపంజరం దాదాపు ఏడు వేల సంవత్సరాల నాటిదని వారు గుర్తించారు. ఈ అస్థిపంజరాన్ని చూసిన పురావస్తు బృందం అధికారులు తొలుత ఆశ్చర్యానికి గురయ్యింది. నిజానికి అస్థిపంజరాలు బయల్పడటమనేది కొత్త విషయం కాదు. పురాతన అస్థిపంజరాలు అనేకం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయి. అయితే వింతగా ఉన్న ఈ అస్థిపంజరాన్ని చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. 


వాస్తవానికి ఈ అస్థిపంజరం ఇతర అస్థిపంజరాలకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ మమ్మీ అస్థిపంజరం దుస్తులు ధరించి ఉంది. దాని తలపై వెంట్రుకలు, చర్మం పలుచని పొరలాగా పొడిగా కనిపించింది. ఈ అస్థిపంజరం క్రీస్తుపూర్వం 5020 నాటిదని పరిశోధనా బృందం చెబుతోంది. అంటే దాదాపు ఏడు వేల సంవత్సరాల నాటిది. సాధారణంగా అస్థిపంజరం ఇలా ఉండదు. అంతలా తల వెంట్రుకలు ఉండవు. అది కూడా పరిపూర్ణ స్థితిలో కనిపిస్తోంది. ఈ అస్థిపంజరం ఆర్కియో హిస్టరీస్ ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యింది. ఈ అస్థిపంజరం 5020 BC నాటిదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పురాతన కాలంలో మృతదేహాలను కృత్రిమంగా మమ్మీగా మార్చడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిందంటున్నారు. దీనిని చిన్‌కోరో మమ్మీ అని పిలుస్తారు. అయితే చాలా మంది ఈ ఫొటోను ఫేక్ అని అంటున్నారు. దానిని నమ్మడం లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ మమ్మీ ఎలా ఇలా ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు దాని జుట్టు, బట్టలు ఇంతకాలం ఎలా సురక్షితంగా ఉన్నాయంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఫోటో చూసిన వారంతా రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ పోస్ట్‌ను 6 వేల 300 మందికి పైగా యూజర్స్ లైక్ చేసారు. కొంతమంది యూజర్స్ దీనిని ఈ స్థితిలో పాతిపెట్టారా? అని ప్రశ్నిస్తున్నారు. దాని దవడలు ఎలా ఊడిపోయాయని మరొకరు ప్రశ్నించారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST