మున్సిపల్‌ కార్మికులు సమ్మె నోటీస్‌

Published: Tue, 25 Jan 2022 22:14:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మున్సిపల్‌ కార్మికులు సమ్మె నోటీస్‌మున్సిపల్‌ మేనేజరుకు సమ్మె నోటీస్‌ ఇస్తున్న కార్మికులు

కావలి, జనవరి 25: 11వ పీఆర్సీ సిఫార్సులను పాత పద్ధతిలో, ఐదేళ్ల వేతన సవరణ కాలపరిమితి యదావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ కార్మికులు మంగళవారం కావలి మున్సిపల్‌ మేనేజర్‌ సికిందర్‌కు సమ్మె నోటీస్‌ అందచేశారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సీఐటీయూ రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానం మేరకు సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు పీ.పెంచలయ్య, నాయకులు వై.రవి, షేక్‌ ఫాన్‌వాజ్‌, ఎం.పోలయ్య, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఆనందరావు, మాలకొండయ్య, శీనయ్య, జేమ్స్‌, సుబ్బారావు, రమేష్‌, అనిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.