చీపురు చేతపట్టిన మున్సిపల్‌ చైర్మన

ABN , First Publish Date - 2021-04-18T06:17:39+05:30 IST

పట్టణంలోని 24వ వార్డులో శనివారం పర్యటించిన మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చీపురు చేతబట్టి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను ఊడ్చే ప్రయత్నం చేశారు.

చీపురు చేతపట్టిన మున్సిపల్‌ చైర్మన
ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి, ఏప్రిల్‌ 17: పట్టణంలోని 24వ వార్డులో శనివారం పర్యటించిన మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చీపురు చేతబట్టి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను ఊడ్చే ప్రయత్నం చేశారు. ఈవార్డు కౌన్సిలర్‌గా టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందిన ఆయన మున్సిపల్‌ చైర్మన అయ్యారు. వా ర్డు ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉన్నానని ఆయన అన్నారు. మీ రు ణం తీర్చుకొనేందుకు వార్డును క్లీనఅండ్‌గ్రీనగా మార్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇళ్లముందు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని సూ చించారు. వార్డులో తిరుగుతున్న సమయంలో ఒక ఇంటిముందు చెత్తాచెదారం ఉండడంపై ఆయన మండిపడ్డారు. ఇంటిలోని వారిని బయటకు పి లిపించి.. ఇళ్లముందు ఇలా అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావా అని ప్ర శ్నించారు. పక్కనున్న పరకను తీసుకొని ఊడ్చే ప్రయత్నం చేయగా, వారు అడ్డగించారు. ఇకనుంచి తాము ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ఆయనకు తెలిపారు. మరో ఇంటివద్ద ఉన్న కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వారితో మాట్లాడారు. కాలువల్లో చెత్తవేస్తే  ము రికినీరు ఎలా బయటకు వెళతాయని, నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి రో గాలు రావా అని వారిపై మండిపడ్డారు. అందరూ కలిసికట్టుగా పరిశుభ్రతపై సమరం పూరిస్తే తప్ప తన ఆశయం ఎలా నెరవేరుతుందని వారికి హితవు పలికారు. ప్రతి ఇంటికి మొక్కలను ఉచితంగా పంపిణీచేస్తామని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. తనను గెలిపించిన వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే ప్రతిఒక్కరూ పరిశుభ్రతౖ, చెట్ల పెంపకానికి నడుం బిగించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-04-18T06:17:39+05:30 IST