మహారాజ కోట ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ మహా రగడ

ABN , First Publish Date - 2022-01-06T00:26:25+05:30 IST

నగరంలోని మహారాజ కోట ఎదుట మున్సిపల్ కార్పొరేషన్

మహారాజ కోట ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ మహా రగడ

విజయనగరం: నగరంలోని మహారాజ కోట ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ మహా రగడ చేసింది. మాన్సాస్ అనుమతి లేకుండా మహారాజ కోట ప్రాంగణానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి సమక్షంలో కొలతలు వేశారు. కోట ముందు స్థలాన్ని కార్పొరేషన్‌కి అప్పగించాలని పట్టు పట్టింది. మాన్సాస్ చైర్మన్, దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మాన్సాస్ విలువైన ఆస్తిపై కొంత మంది జులుం చేసే అవకాశం ఉందని రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీకి మాన్సాస్ అధికారులు  ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్యూరిటీతో కాపలా కాస్తున్నారు. 

Updated Date - 2022-01-06T00:26:25+05:30 IST