పట్నం వేడెక్కింది

ABN , First Publish Date - 2021-03-07T05:21:20+05:30 IST

ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు అన్ని చోట్లా తూచ్‌.. కేవలం ఐదుగురితోనే అభ్యర్థులు ప్రచారం సాగించాలని చెప్పినా గీత దాటేస్తున్నారు.

పట్నం వేడెక్కింది

 ఓటరు స్లిప్‌తోనే నోటు సిద్ధం

రాత్రుళ్లు రహస్య భేటీలు

వలంటీర్ల పరోక్ష సాయం 

ఎన్నికల కమిషన్‌ ఆంక్షలేవి ?

గీత దాటేసి ప్రచారం


(ఏలూరు– ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు అన్ని చోట్లా తూచ్‌.. కేవలం ఐదుగురితోనే అభ్యర్థులు ప్రచారం సాగించాలని చెప్పినా గీత దాటేస్తున్నారు. వివిధ సామాజిక వర్గాల వారీగా రాత్రిళ్లు రహస్య భేటీలు. ఓటుకు నోటు.. ఎంత అని లెక్కలేస్తున్నారు.. ఆటోల్లో ప్రచార మైక్‌లు ఊదర కొడుతున్నాయి. ఎన్నికలు జరగనున్న ఐదింట్లోనూ సీనియర్లు రంగంలోకి దిగారు. ఓటర్లకు దండాలు పెడుతున్నారు.  పట్టణంలో ఇప్పుడు రాజకీయ కాక పీక్‌కి చేరింది. 


సాధారణంగా పల్లెపోరులోనూ, పట్నం పోరులోనూ స్థానిక సమస్యలే తెరముం దుకు వస్తాయి. ప్రజానాడిని ప్రతిస్పంది స్తాయి. దీనిపైనే ఇంతకుముందు రాజకీ య పక్షాలు గడగడలాడిపోయేవి. ఇప్పుడు పట్నం వాసులు పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏలూరు వంటి నగరంలో ఓ వైపు కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే అంతు పట్టని వ్యాధితో భీతిల్లిపోయారు. లోపం ఆహారంలో ఉందో, తాగే నీటిలో ఉందో ఇప్పటికీ తేల్చలేకపోయారు. మరోవైపు పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ వెనువెంటనే కుళాయి పన్ను. ఇప్పటికే నగరంలో విలీనం అయిన పంచాయతీవాసులకు కొత్తభారం పడనుంది. ఇప్పటి వరకు తక్కువగా ఉన్న పన్నులు కాస్తా రెట్టింపు కాబోతున్నా యి. వీటిని మాయచేసి మభ్యపరిచేందుకే ఎక్కడికక్కడ సా మాజిక వర్గాలను తెరముందుకు తెస్తున్నారు. అధికార వైసీపీ ఈ విషయంలో అందె వేసిన చేయి. ఏలూరులో డివిజన్ల వారీ గా జరుగుతున్న ప్రచారంలో ఆ ప్రాంత వాసులకు ఏం చేయ బోతుందీ చెప్పడంలేదు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే పదేపదే ప్రస్తావించడం ద్వారా ఓట్లను కొల్లగొట్టాలనే పథకం. రెండు లక్షల 75 వేలకు పైగా ఓటర్లున్న ఏలూరు నగరంలో ఉద్యోగ, వ్యాపార, విద్యావంతులే కాకుండా మధ్య తరగతి ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బతికేందుకు అనువైన పరిస్థితులే ఉంటాయని ఇప్పటి దాకా నమ్మారు. కానీ నగరపోరు ప్రారంభం అయిన తరువాత అసలు విషయాన్ని అన్నివర్గాలు మర్చిపోయాయి. తెలుగు దేశం, జనసేన వంటి పార్టీలన్నీ ప్రస్తుత ప్రభుత్వంలో పన్ను లు ఏ రకంగా పెరగబోతున్నాయో తమకు అవకాశం ఇస్తే అవి ఎలా నివారించబోతున్నామో ఓటర్లకు చెప్తూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యేకించి ఆస్తిపన్ను భారీఎత్తున అందరి జేబులు ఖాళీ చేయడం ఖాయమనే విషయాన్ని ప్రచారంలోకి వచ్చాయి. వైసీపీ వీటికి భిన్నంగా నగరంలో వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చామన్న విషయం పైకి చెబుతున్నారే గానీ టిడ్కో ఇళ్లను ఎందుకు ఇవ్వలేకపోయారనే విషయాన్ని దాచిపె డుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న వారికి ఎన్నికలు పూర్తయిన తరువాత అంతా జరుగుతుందంటూ దాట వేస్తున్నారు. ఓటర్లు ప్రస్తుతానికి అందరూ చెప్పింది సైలెంటుగా విని ‘మీకే మా.. ఓటు’ అంటూ తెలివిగా తప్పుకుంటున్నారు.  


మున్సిపాల్టీల్లోనూ ఇదే తీరు 

మిగతా నాలుగు మున్సిపాల్టీల్లోనూ ఇప్పటి వరకూ జరిగిం ది వేరే. ఇక భవిష్యత్తులో జరగాల్సింది ఇంకా మిగిలే ఉంది అనేలా ప్రచారపంఽథా మార్చారు. పెండింగ్‌ సమస్యలను ప్రస్తావించినవారే లేరు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రాం తాలన్నింటిలోనూ తాగునీటి కొరత స్పష్టంగా ఉంది. ఏదో తూతూమంత్రంగా సరఫరా చేయడమే కాకుండా  ప్రజలను మభ్యపెట్టే విధంగానే వ్యవహారం సాగింది. జంగారెడ్డిగూడెం లో తెలుగుదేశం తమకు అధికారం ఇస్తే పట్టణాన్ని సుందరవ నంగా చేస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పెన్షన్లు, ఇళ్ళపట్టాలు వాటి గురించే ప్రచారం చేస్తోంది. నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరులోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. మున్సిపల్‌ సమస్యలు ఏ ఒక్కటీ ప్రస్తావనకు రావడం లేదు. ఎవరూ ప్రశ్నించే వారు లేరు. 


ఎవరికెంత.. ?

ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఎవరికెంత అనే లెక్క లు కడుతున్నారు. సోమవారంతో ప్రచారానికి తెరపడబోతోంది. ఆలోపే అధికార వైసీపీ కొంత ఫిక్స్‌ అయి ఓటుకు వెయ్యి అందించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే వార్డు వలంటీర్లు, డివిజన్‌ వలంటీర్లు ఇంటింట ప్రచారాన్ని పరోక్షంగా పూర్తిచే శారు. ఫలానా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కొందరు అత్యు త్సాహ వంతులు పరోక్షంగా ఓటర్లకు సూచించారు. మున్సి పాల్టీలో అధికారికంగా ఓటర్లకు ఇచ్చే స్లిప్‌తోపాటు నోటు చేర్చి ఇచ్చేందుకు దాదాపు అన్నిచోట్ల ప్రయత్నాలు కొనసాగుతున్నా యి. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలాచోట్ల విస్తరించింది. ఉద్యోగు లు, వ్యాపారులు అత్యధికంగా ఉన్నచోట్ల మినహా మిగతాచోట్ల ఓటరు స్లిప్‌తో పాటుగా తాయిలాలు ఇచ్చేస్తున్నారు. ఆదివా రం నాటికి ఇది రెండింతలు కానుంది. 


ఆంక్షలు..గీత దాటేశారు 

పురపోరులో ప్రచారయాత్రలో ఈ మధ్యలో ఎన్నికల సం ఘం ఆంక్షలు విధించింది. అభ్యర్థులతోపాటు ఐదుగురుకు మించి ఉండరాదని ఆంక్ష పెట్టింది. మొదటి రెండు రోజులు అందరూ అణిగి మణిగి ఉన్నట్లుగానే వ్యవహరించారు. కానీ ప్రచారపర్వం దగ్గర పడుతున్న వేళ ఆ నియమాలను పక్కన పెట్టేశారు. పెద్దఎత్తున వార్డుల్లో, డివిజన్లలో యాత్రలను తలపించేలా ప్రచార హోరు కొనసాగుతోంది.  


వలంటీర్లు ప్రచారం చేసినా.. పాల్గొన్నా చర్యలు : కలెక్టర్‌ 

ఏలూరు సిటీ, మార్చి 6 : వార్డు వలంటీర్లు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో ప్రచారం చేసినా, పాల్గొన్నా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్టేనని శిక్షార్హులని ఎన్నికల కమిషన్‌ తెలియజేస్తోందని ఆయన కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. ఎవరైనా  కాల్‌ సెంటర్‌ నెంబరు 0863–2218089/ 2222750కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, మున్సిపాల్టీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా వార్డు వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చటం, ఓటర్లను ప్రభావితం చేయడం శిక్షార్హమని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌/ కాల్‌సెంటర్‌ ఫోన్‌ నెంబర్‌ 08812–222297, 08812–295497 మున్సిపాల్టీ ఎన్నికల నోడల్‌ అధికారి సీహెచ్‌ బాపిరాజు, అడిషినల్‌ కమిషనర్‌, ఏలూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ సెల్‌నెంబర్‌ 7386004666లకు ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు.


Updated Date - 2021-03-07T05:21:20+05:30 IST