అర్హులకే మున్సిపల్‌ ఉద్యోగాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-26T07:02:44+05:30 IST

అర్హులైన నిరుద్యోగులకే మున్సిపాలిటీ లో భర్తీ చేయబోతున్న ఉద్యోగాలను కేటాయించాలని, అవకతవకలు జరుగు తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై వెంటనే విచారణ జరపాలంటూ బీజేపీ నాయ కులు డిమాండ్‌ చేశారు.

అర్హులకే మున్సిపల్‌ ఉద్యోగాలు ఇవ్వాలి
అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేకు ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు

అవకతవకలపై విచారణ జరపండి 

అడిషనల్‌ కలెక్టర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

నిర్మల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన నిరుద్యోగులకే మున్సిపాలిటీ లో భర్తీ చేయబోతున్న ఉద్యోగాలను కేటాయించాలని, అవకతవకలు జరుగు తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై వెంటనే విచారణ జరపాలంటూ బీజేపీ నాయ కులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ హేమం త్‌ బోర్కడేకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణా,గోదావరి జలాల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ రావుల రాంనాథ్‌ మాట్లాడు తూ... మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పబ్లిక్‌హెల్త్‌ విభాగం కోసం భర్తీ చేయబోతున్న ఉద్యోగాలను అంగట్లో సరుకుల అమ్ముకుంటున్నారని ఆరో పించారు. ఒక్కో పోస్టుకు పది నుండి ఇరవై లక్షల రూపాయల వరకు వసూ లు చేస్తున్నట్లు వివరించారు. కొంతమంది ఉన్నతాధికారులు సైతం దీనికి పరో క్షంగా సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఉద్యోగుల భర్తీ కోసం ఎలాంటి పత్రికా ప్రకటనలు ఇవ్వకుండా రహస్యంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిబంధన లకు అనుగుణంగా అర్హులైన నిరుద్యోగులతో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనట్లయితే న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో కేంద్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ అయ్యన్నగారి భూమయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, గాదే విలాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు సాధం అరవింద్‌, నాయకులు శ్రీధర్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్‌, ఆర్‌. మల్లేష్‌, అయ్యన్నగారి రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T07:02:44+05:30 IST