ఆస్తి విలువ బట్టి ఇంటి పన్ను

ABN , First Publish Date - 2020-11-29T04:29:40+05:30 IST

కుటుంబ యజమాని ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించనున్నట్టు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రమేష్‌ తెలిపారు. శనివారం పట్టణంలో నాడు-నేడు నిధులతో జరుగుతున్న మున్సిపల్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఆస్తి విలువ బట్టి ఇంటి పన్ను
డీవీఎంఎం పాఠశాలను పరిశీలిస్తున్న మునిసిపల్‌ ఆర్డీ రమేష్‌




మునిసిపల్‌ ఆర్డీ రమేష్‌

పార్వతీపురం టౌన్‌, నవంబరు 28 : కుటుంబ యజమాని ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించనున్నట్టు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రమేష్‌ తెలిపారు. శనివారం పట్టణంలో నాడు-నేడు నిధులతో జరుగుతున్న మున్సిపల్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజియన్‌ పరిధిలోని 13 మునిసిపా లిటీల్లోని ఉన్నత, ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే మునిసిపాలిటీల్లో సాలిడ్‌వేస్టు మేనేజ్‌మెంట్‌ కార్య క్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. రీజియన్‌ పరిధిలో ఇ ప్పటి వరకు 30 శాతం పన్ను వసూళ్లను చేపట్టామని, 2021 మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. పార్వతీపురం పట్టణానికి సురక్షిత నీటి పథకానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నిధులు త్వరలో మంజూరు కానున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.కనకమహలక్ష్మి, ఏఈలు ఆనంద్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 





Updated Date - 2020-11-29T04:29:40+05:30 IST