మున్సిపల్‌ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-26T04:59:20+05:30 IST

మున్సిపల్‌ ఉపాద్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న లక్ష్మిరాజా

కడప(ఎడ్యుకేషన్‌), జూలై 25: మున్సిపల్‌ ఉపాద్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు. కడప నగరం యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశం జరగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీ పోస్టులను స్కూలు అసిస్టెంటు పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని, అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీ అవకాశం ఇవ్వాలని, స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా  ఆన్‌లైన్‌ సంతకాల ద్వారా ముఖ్య కార్యదర్శికి పిటిషన్‌ సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబిర్‌, కోశాధికారి మస్తానయ్య, నాయకులు  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-26T04:59:20+05:30 IST