పీఆర్‌సీ నివేదికతో తీవ్ర అన్యాయం

ABN , First Publish Date - 2022-01-25T05:21:42+05:30 IST

రాష్ట్రప్రభుత్వ 11వ పీఆర్సీ నివేదిక కార్మికులను తీవ్ర నిరాశ పరిచిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య పేర్కొన్నారు.

పీఆర్‌సీ నివేదికతో తీవ్ర అన్యాయం

కావలి, జనవరి 24: రాష్ట్రప్రభుత్వ 11వ పీఆర్సీ నివేదిక కార్మికులను తీవ్ర నిరాశ పరిచిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య పేర్కొన్నారు. ఏఐటీ యూసీ అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా దామా అంకయ్య, సీపీఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యంలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఉద్యోగ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు, పెన్షనర్లను 11వ వేతన సవరణ నివేదిక తీవ్ర నిరాశపరి చిందన్నారు. పీఆర్సీతో ఎక్కువ జీతాలు వస్తాయని ఉద్యోగులను మభ్యపెడుతున్నారని అది అవాస్తమన్నారు.  చీకటి జీవోలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియ న్‌ జిల్లా అధ్యక్షుడు మల్లె అంకయ్య, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు చేవూరి కొండయ్య, పసుపులేటి మహేష్‌, యూనియన్‌ నాయకులు ఎండ్లూరి ఆదినారాయణ, గుంజి క్రిషోర్‌, మాలకొండయ్య, ప్రభావతి పాల్గొన్నారు.

ఆత్మకూరులో ధర్నా

ఆత్మకూరు: మున్సిపల్‌ రంగంలో ఉద్యోగులు, పింఛను దారులు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 11వ వేతన సవరణ నివేదిక ప్రకారం వేతనాలు సవరించి ఇప్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జె నాగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాల యం వద్ద సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మరో రెండురోజుల పాటు వరుసగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్క్‌ర్స్‌ యూనియన్‌ నాయకులు షేక్‌ మునీర్‌బాషా, బి హజరత్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:21:42+05:30 IST