Guntur: ప్రభుత్వానికి వ్యతిరేకంగా Workers నినాదాలు

ABN , First Publish Date - 2022-07-14T18:38:32+05:30 IST

గుంటూరు నగర పాలకసంస్థ ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Guntur: ప్రభుత్వానికి వ్యతిరేకంగా Workers నినాదాలు

గుంటూరు (Guntur): తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ (AP)లోని మున్సిపల్ కార్మికులు (Municipal Workers) చేపట్టిన సమ్మె (Strike) నాలుగోరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గుంటూరు నగర పాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి (Jagan reddy) అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, సమ్మె విరమించి చర్చలకు రావాలని చెప్పడం సరికాదన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి భజన చేసే వారితో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సృష్టించారని ఆరోపించారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నారని విమర్శించారు. ప్రభుత్వం గొప్పలకు పోకుండా తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కారించాలని, తమకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని మధుబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-14T18:38:32+05:30 IST