సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజ నీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనె 10 వతేదీ అర్థరాత్రి నుంచి సమ్మె నిర్వహిస్తున్న ట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షు డు సాంబశివ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికుల సమ్మె
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

మదనపల్లె అర్బన్‌, జూలై 6: మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజ నీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనె 10 వతేదీ అర్థరాత్రి నుంచి సమ్మె నిర్వహిస్తున్న ట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షు డు సాంబశివ పేర్కొన్నారు.  బుధవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రసమితి పిలుపు మేరకు పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు కార్మికుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర ్భంగా సాంబశివ మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ , కాంట్రాక్టు  కార్మికులను పర్మనెంట్‌ చేస్తానని హామి ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.  ఈ కారక్రమంలో పారిశుధ్యకార్మిక నాయ కులు శ్రీనివాసులు, సంజీవ, జానకి, శంకర, ఇంజనీరింగ్‌ వరక్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగరాజు, బాలకృష్ణ, గోపాలకృష్ణ, రత్నం, పారిఽశుధ్య అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వాసు, మధు, రత్నమ్మ, భాగ్యమ్మ, ఉమ పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST