Kuwait: ప్రభుత్వ సర్వీసుల నుంచి ప్రవాసులకు ఉద్వాసన.. ఈసారి టార్గెట్ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-08-21T13:53:03+05:30 IST

2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ద్వారా ప్రవాసులకు కువైత్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది.

Kuwait: ప్రభుత్వ సర్వీసుల నుంచి ప్రవాసులకు ఉద్వాసన.. ఈసారి టార్గెట్ ఎవరంటే..

కువైత్ సిటీ: 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ద్వారా ప్రవాసులకు కువైత్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థానికులకు భారీ మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రవాసుల ప్రాధాన్యతను తగ్గించాలనే ఏకైక ఉద్దేశంతో కువైత్ ఈ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని పలు కీలక శాఖల్లోని ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రవాసులకు (Expats) ఉద్వాసన పలికి, వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా ఇప్పుడు మున్సిపాలిటీ శాఖలో (Municipality) ప్రక్షాళన మొదలెట్టింది. 


ఈ మేరకు తాజాగా ఆ దేశ మున్సిపాలిటీ మంత్రి డా. రానా అల్ ఫేర్స్ ఈ శాఖలో మూడు దశల్లో ప్రవాసుల స్థానాల్లో కువైటీలను నియమించేందుకు ప్రణాళికను ప్రకటించారు. దీనిలో భాగంగా మొదటి ఫేజ్‌లో 33శాతం నాన్-కువైటీ (Non-Kuwaiti) కాంట్రాక్టర్లను తొలగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి మొదటి ఫేజ్ ప్రారంభం కానుంది. అలాగే 2023 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న రెండో ఫేజ్‌లో మరో 33శాతం మందిని తొలగించనున్నారు. ఇక 2023 జూలై 1 నుంచి ప్రారంభించనున్న మూడు ఫేజ్‌లో మిగిలిన 33శాతం మందిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలా మూడు దశల్లో మున్సిపాలిటీ శాఖలోని ప్రవాస ఉద్యోగులందరినీ తొలగించి వారి స్థానాల్లో కువైటీలను నియమించేందుకు కువైత్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్‌ అహ్మద్ అల్ మన్ఫౌహీకి మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. మున్సిపాలిటీ శాఖలో ఉన్న నాన్-కువైటీ ఉద్యోగుల వివరాలను వెంటనే మంత్రిత్వశాఖకు అందించాల్సిందిగా ఆమెను మంత్రి ఆదేశించారు. 


వీరికి మినహాయింపు..

అయితే, ఈ ఆదేశాల నుంచి కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన నాన్-కువైటీ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. కువైత్ మదర్‌కు పుట్టిన నాన్-కువైటీ ఉద్యోగులకు ఇది వర్తించదు. అలాగే జీసీసీ (Gulf Cooperation Council Countries), కువైత్ పర్మినెంట్ రెసిడెంట్స్‌కు కూడా దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. 

Updated Date - 2022-08-21T13:53:03+05:30 IST