వైసీపీ బెదిరింపులకు బెదరం

ABN , First Publish Date - 2021-03-03T07:31:50+05:30 IST

: అధికార వైసీపీ అరాచకాలు, బెదిరింపులకు బెదిరేదిలేదనీ, నగరంలోని అన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఉద్ఘాటించారు.

వైసీపీ బెదిరింపులకు బెదరం

అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్నాం

సీపీఐకి 4, ముస్లిం లీగ్‌కు 45వ డివిజన్‌ కేటాయింపు

జాబితానుప్రకటించిన వైకుంఠంప్రభాకరచౌదరి

అనంతపురం వైద్యం, మార్చి 2: అధికార వైసీపీ అరాచకాలు, బెదిరింపులకు బెదిరేదిలేదనీ, నగరంలోని అన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఉద్ఘాటించారు. మంగళవారం నియోజకవర్గ కార్యాలయంలో సీపీఐ జగదీశ్‌తో కలిసి కార్పొరేటర్ల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అనంతరం ప్రభాకరచౌదరి మాట్లాడుతూ సీపీఐ, ఇండియన్‌ ముస్లిం లీగ్‌ను కలుపుకుని, నగరపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. సీపీఐకి నాలుగు సీట్లు, ఇండియన్‌ ముస్లిం లీగ్‌కు 45వ డివిజన్‌ కేటాయించామన్నారు. ఎన్నడూలేని విధంగా 43 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించామన్నారు. పాతవారు 8 మందికే కేటాయించామన్నారు. మిత్రపక్షం సీపీఐకి 2, 9, 10, 40 డివిజన్లు కేటాయించామన్నారు. 32వ డివిజన్‌ మాత్రమే పెండింగ్‌ ఉందనీ, బుధవారం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ మాట్లాడుతూ టీడీపీ, సీపీఐ విధానపరమైన అభిప్రాయా లు ఒక్కటిగా ఉండటంతో కలిసి పోటీ చేస్తున్నామన్నారు. అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పోరాటం సాగిస్తామన్నారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగకుండా అధికార వైసీపీ చేస్తున్న అరాచకాలు సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు.. కార్యకర్తలను కాదని, వలంటీర్లను నమ్ముకుని, రాజకీయాలు చేస్తున్నారన్నారు. పథకాలు పోతాయని బెదిరిస్తూ, మద్యం డబ్బు పంపిణీ చేసి, గెలవాలని చూస్తున్నారన్నారు. ధైర్యముంటే ప్రజలతో ఓట్లు వేయించకుని, అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు.


వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితా విడుదల 

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 2: ఎట్టకేలకు నగరపాలక సంస్థలో అధికార వైసీపీ కార్పొరేటర్ల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 50 డివిజన్లకు అభ్యర్థులను ప్రక టించింది. 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కేటాయించటంతో ఆ 25 డివిజన్లలో మహిళా అభ్యర్థులే పోటీలో నిలిచారు. జనరల్‌కు కేటాయించినప్పటికీ మరో రెండు డివిజన్లలో మహిళా అ భ్యర్థులే రంగంలో ఉన్నారు. మొత్తం 27 మంది మహిళలు, 23 మంది పురుష అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 


Updated Date - 2021-03-03T07:31:50+05:30 IST