గుహలో వెలసిన మునీశ్వరుడు

ABN , First Publish Date - 2020-11-25T03:19:54+05:30 IST

నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలకు పుట్టినిల్లు.

గుహలో వెలసిన మునీశ్వరుడు
జలపాతం కింద మునీశ్వర ఆలయం

- నల్లమల అభయారణ్యంలో కొలువైన క్షేత్రం

- గిరిజనులకు ప్రత్యేక ఆరాధ్య దైవం

- రెండు కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం

- ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు

- వారం రోజుల దీక్ష స్వీకరిస్తున్న గిరిజనులు


పదర, నవంబరు 24 : నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలకు పుట్టినిల్లు. దట్టమై న అడవిలో కొండ చెరియల మధ్య వెలసిన ఉమామహేశ్వరం, లొద్ది, సలేశ్వరం క్షేత్రాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. మల్లెల తీర్థంలోని జలపాతం పర్యాటకుల ను ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచగా, ఇప్పుడు ఇదే అడవిలో ఉన్న మునీశ్వరాలయం భక్తు లను ఆకర్షిస్తోంది. ఆ ఆలయ విశేషాలు, వి శిష్ఠతలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.


గోవులను కాపాడిన మునీశ్వరుడు


ఈ క్షేత్రంపై ఆసక్తికర కథనం ఈ ప్రాం తంలో ప్రచారంలో ఉంది. ఐదు దశాబ్దాల కిందట నల్లమలోని దట్టమైన అటవీ ప్రాం తంలో ఉన్న బక్కలోటికయ్య కొండల ప్రాం తం, నల్లవాగు ప్రాంతం  పశువుల మేతకు అనువుగా ఉండేది. దీంతో అక్కడే లంబాడీ, చెంచు జాతులకు చెందిన కొన్ని కుటుంబా లు నివాసం ఉండేవి. వీరు పశు సంపదే (ఆవులు) జీవనాధారంగా కుటుంబాలను పోషించుకునే వారు. వీరి వద్ద దాదాపు రెం డు వేలకు పైగా గోసంపద ఉండేది. వీటిని బాల్యా సాధూజీ, చెంచు బయ్యన్నలు రో జూ కొండల ప్రాంతానికి మేత కోసం తీసు కెళ్లే వారు. కొన్ని రోజుల తరువాత అనుకో కుండా ఈ పశువులన్నీ అంతుచిక్కని వ్యాధి తో చనిపోవడం ప్రారంభించాయి. ఈ సమ యంలో ఓ వృద్ధుడు మునీశ్వరుడి రూపం లో అడవిలో ప్రత్యక్షమయ్యాడు. చనిపోతు న్న ఆవుల మంద మీద మారేడు పత్రి, ఎల క పత్రి, తులసీ దళం తీర్థాన్ని చల్లి అదృశ్య మయ్యాడు. దీంతో ఆవులు చనిపోవడం ఆ గిపోయింది. అప్పటి నుంచి గో సంపద వృ ద్ధి చెందడం ప్రారంభమైంది. అప్పటి నుంచి గిరిజనులు ఆవులను బతికించిన మునీశ్వ రుడిని ఆరాధించడం ప్రారంభించారు. 


వారం రోజులు దీక్ష


గో సంపదను కాపాడిన మునీశ్వరుడికి గిరిజనులు ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్ర త్యేక పూజలు చేస్తారు. బక్కలోటికయ్య కొం డల ప్రాంతంలో ఉన్న ఓ గుహలో మునీశ్వ రుడు ప్రత్యక్షమయ్యడని, అక్కడే ఆయనకు పూజలు చేయడం ప్రారంభించారు. ఇందు కోసం గిరిజనులు వారం రోజుల పాటు ప్ర త్యేక దీక్షను స్వీకరిస్తారు. చివరి రోజు గుహ లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు ఒం టి పూట భోజనం చేస్తారు. అక్కడే రాత్రం తా నిద్రిస్తారు. మరుసటి రోజు ఉదయం ఆ వు పాలు, ఆవు నెయ్యి, బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని మునీశ్వరుడికి నైవేద్యం గా సమర్పిస్తారు. ఈ గుహలోకి ఒక్కొక్కరి గానే వెళ్లాల్సి ఉంటుంది. పూజలు చేసే స మయంలో ప్రతిధ్వని వినిపిస్తే, కోరిన కోర్కె లు తీరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే దీక్ష సమయంలో నియమనిష్టలు పాటించ ని వారిపై తేనేటీగలు దాడి చేస్తాయని గిరి జనుల నమ్మకం. దీనికి తోడు 50 ఏళ్లు దా టి మహిళలు మాత్రమే మునీశ్వర స్వామి ని దర్శించుకోవాలి.


ఎలా వెళ్లాలి?


నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియో జకవర్గం పదర మండలం మారేడుగు గ్రా మానికి 12 కిలోమీటర్ల దూరంలో బక్కలోటి కయ్య కొండల ప్రాంతం ఉంది. ఇక్కడికి ఒ కటిన్నర కిలోమీటర్ల దూరం కృష్ణానది పా రుతోంది. ఇక్కడ రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం సందర్శకుల ను ఆకట్టుకుంటోంది. ఈ జలపాతం కిందే మునీశ్వరుడి గుహ ఉంది. ఈ ప్రాంతానికి హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు నేరుగా బ స్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో పదర, వంకేశ్వ రం మీదుగా మారేడుగు వెళ్లాలి. అక్కడి నుంచి కాలి నడకన బక్కలోటికయ్య ప్రాం తానికి చేరుకోవాలి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చే వారు అచ్చంపేట మీదు గా పదరకు చేరుకొని, అక్కడి నుంచి మారే డుగు గ్రామానికి చేరుకోవచ్చు. అయితే, ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ముందుగా అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకో వాల్సి ఉంటుంది.

Updated Date - 2020-11-25T03:19:54+05:30 IST