Munugodu Congress: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తోందా?

ABN , First Publish Date - 2022-09-02T01:45:37+05:30 IST

తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే దృష్టి సారించాయి. ఎలాగైనా సరే ఉప ఎన్నిక..

Munugodu Congress: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తోందా?

మునుగోడు (Munugode): తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే దృష్టి సారించాయి. ఎలాగైనా సరే ఉప ఎన్నిక (By Poll)లో గెలవాలనే వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్‌‌ (Congress)కు అయితే సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని నిలబెట్టుకోవాలని కసరత్తు చేస్తోంది.  కానీ ఇప్పటివరకూ అభ్యర్థిని ఫైనలేజ్ చేయలేదు. 


అయితే తాము ప్రపోజ్ చేస్తున్న వ్యక్తినే క్యాండిడేట్‌గా డిక్లేర్ చేయాలని సీనియర్లు ఈగోలకు పోతున్నారట. బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కొందరు నేతలు ప్రపోజల్స్‌ పెడుతుంటే కృష్ణారెడ్డికే టికెట్ ఇవ్వాలని రేవంత్ అండ్ కో వాదిస్తుందట. ఉమ్మడి నల్గొండ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాము బలపరుస్తున్న పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi)కే టికెట్ ఇవ్వాలని లాబియింగ్ చేస్తున్నారట. 


ఇదిలా ఉంటే మునుగోడులో కింది స్థాయి కాంగ్రెస్ నేతలకు పక్క పార్టీలు గాలం వేస్తున్నాయట. దీంతో పార్టీలో ఉంటారో వేరే పార్టీకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొందట. ఇప్పటికైనా పార్టీ క్యాండెట్‌ని అనౌన్స్ చేస్తే క్యాడర్ పని క్యాడర్ చేసుకుంటుందని, లేకపోతే తలో దిక్కు వెళ్లిపోతారని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.


అయితే మునుగోడు సిట్టింగ్ స్థానం, పట్టున్న నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్‌ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు క్రెడిబిలిటి ఉన్నా, లీడర్స్ తీరుతో డ్యామేజ్ అవుతుందనేది విశ్లేషకుల ఒపీనియన్. అభ్యర్థిపై నిర్ణయం తీసుకోకపోతే మునుగోడుతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. 



Updated Date - 2022-09-02T01:45:37+05:30 IST