Munugode : ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్

ABN , First Publish Date - 2022-09-09T18:35:32+05:30 IST

ఎట్టకేలకు సస్పెన్స్(Suspence) వీడింది. ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి(Congress contestant) ఫిక్స్.

Munugode : ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్

Munugode : ఎట్టకేలకు సస్పెన్స్(Suspence) వీడింది. ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి(Congress contestant) ఫిక్స్. బీజేపీ(BJP) అభ్యర్థి ముందుగానే ఫిక్స్ కాబట్టి ఆ పార్టీకి అలకల బాధ లేదు. దీంతో ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ టీఆర్ఎస్(TRS), కాంగ్రెస్ పార్టీ(Congress Party)లు మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో కసరత్తుల మీద కసరత్తులు చేశాయి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా రోజుల పాటు తర్జన భర్జనలు పడి చివరకు పాల్వాయి స్రవంతి(Palwayi Sravanthi)ని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. 


కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)లు పాల్వాయి స్రవంతి పేరును ఫిక్స్ చేసి అధిష్ఠానానికి పంపించారు. నిజానికి ఇద్దరి పేర్లు ఫైనల్ లిస్ట్‌(Final List)కు వచ్చాయి. కానీ వారిద్దరిలో ఎవరిని ఖరారు చేసినా మరొకరికి ఆగ్రహం వచ్చి తీరుతుంది. నొప్పించక తానొవ్వక అన్న సూత్రమా.. ఇక్కడ పనికి రాదు. ఎవరినో ఒకరిని పక్కాగా నొప్పించాల్సి వస్తుంది. అప్పుడు వేరొకరు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో అనేక తర్జన భర్జనల మీదట ఎవరో ఒకరినైతే పక్కాగా నిర్ణయించాలి కాబట్టి పాల్వాయి స్రవంతి పేరును ఫిక్స్ చేశారు. దీంతో నివేదికను టీపీసీసీ(TPCC) అధిష్టానానికి నివేదిక పంపింది. అధిష్ఠానం కూడా కొద్ది సేపటి క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.




Updated Date - 2022-09-09T18:35:32+05:30 IST