By-Election: మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికపై ముగ్గురి పేర్లతో కాంగ్రెస్ షార్ట్ లిస్టు..

ABN , First Publish Date - 2022-09-01T19:35:20+05:30 IST

మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By-Election)ల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతోంది.

By-Election: మునుగోడు ఉపఎన్నికలో  అభ్యర్థి ఎంపికపై ముగ్గురి పేర్లతో కాంగ్రెస్ షార్ట్ లిస్టు..

నల్గొండ జిల్లా (Nalgonda District): మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By-Election)ల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) పార్టీ జోరు పెంచుతోంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) మరికొసేపట్లో మునుగోడులో చార్జీషీట్‌ను విడుదల చేసి ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఏడు మండలాలకు కేటాయించిన 14 మంది ఇన్చార్జ్‌ల ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు. అధికార టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) నిర్ణయాలతో నల్గొండ జిల్లాకు సాగునీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందనేది కాంగ్రెస్ నేతల ప్రచారాస్త్రం. దిండి ప్రాజెక్టు ఆలస్యం, పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోవడంతో నల్గొండ జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది మునుగోడు ప్రచారంలో వివరించాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. అభ్యర్థి ఎంపిక, ప్రచారంపై ఫోకస్ పెడుతోంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీ ఇన్చార్జ్ మాణిక్కం ఠగూర్ (Manikkam Tagore) నేరుగా రంగంలోకి దిగారు. టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముగ్గురు పేర్లతో షార్ట్ లిస్టు సిద్ధం చేశారు. అందులో కృష్ణారెడ్డి (Krishna Reddy), పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi), పల్లె రవి కుమార్ (Palle Ravikumar) పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిపై పార్టీ నేతల అభిప్రాయం తీసుకుని, మరోసారి సర్వే చేసి.. ఆ నివేదికను అధిష్టానానికి పంపాలని నిర్ణయించారు. అభ్యర్థి ఎవరైనా సరే అంతా కలిసికట్టుగా విజయం కోసం పని చేయాలని మాణిక్కం ఠాగూర్ సూచించారు.


Updated Date - 2022-09-01T19:35:20+05:30 IST